రూ.2.50 లక్షల CMRF-LOC అందజేసిన PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ

శేరిలింగంప‌ల్లి, సెప్టెంబ‌ర్ 23 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): ఆల్విన్‌ కాలనీ డివిజన్‌ పరిధిలోని ఎల్లమ్మండకు చెందిన రాములు అత్యవసర వైద్య చికిత్స కోసం ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF)కి దరఖాస్తు చేసుకున్నాడు. ఈ నేపథ్యంలో CMRF-LOC ద్వారా మంజూరైన రూ.2.50 లక్షల ఆర్థిక సహాయానికి సంబంధించిన మంజూరు పత్రాన్ని PAC చైర్మన్, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ బాధిత కుటుంబానికి అందజేశారు. ఈ సందర్భంగా గాంధీ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి సహాయ నిధి పేద ప్రజలకు గొప్ప వరమని అన్నారు. ప్రజా సంక్షేమమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం పనిచేస్తోందని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పేదల పక్షపాతి అని అన్నారు.

ఆపదలో ఉన్న వారికి ముఖ్యమంత్రి సహాయ నిధి ఆపన్నహస్తంగా నిలుస్తోందని గాంధీ తెలిపారు. అనారోగ్యానికి గురై ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న, ఆర్థిక స్థోమత లేని నిరుపేదలకు CMRF ఆర్థిక భరోసా కల్పిస్తోందని చెప్పారు. వైద్య చికిత్స కోసం ఆర్థిక సహాయం అందించిన PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీకి బాధిత కుటుంబ సభ్యులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు పోతుల రాజేందర్, యాసిన్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here