మనవరాలి జన్మదినం సందర్భంగా 105 అంగన్‌వాడీ కేంద్రాలకు ప్రెషర్ కుక్కర్లు

శేరిలింగంప‌ల్లి, సెప్టెంబ‌ర్ 22 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): శేరిలింగంపల్లి నియోజకవర్గ పరిధిలోని అంగన్‌వాడీ కేంద్రాలకు PAC చైర్మన్, ఎమ్మెల్యే ఆరేకపూడి గాంధీ సహాయాన్ని అందించారు. తన మనవరాలు చిరంజీవి భ్రమర జన్మదినాన్ని పురస్కరించుకుని, గాంధీ తన సొంత నిధులతో నియోజకవర్గంలోని 105 అంగన్‌వాడీ కేంద్రాలకు ప్రెషర్ కుక్కర్లను పంపిణీ చేశారు. అంగన్‌వాడీ కేంద్రాల్లో చిన్నారులకు అందించే భోజనం తయారీకి ఈ ప్రెషర్ కుక్కర్లు ఉపయోగపడనున్నాయి. తన మనవరాలి జన్మదిన వేడుకలను సామాజిక సేవా కార్యక్రమంగా నిర్వహిస్తూ అంగన్‌వాడీ కేంద్రాలకు అవసరమైన సామగ్రిని అందించారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here