భారతీనగర్ (నమస్తే శేరిలింగంపల్లి): జీహెచ్ఎంసీ ఎన్నికల్లో భారతీ నగర్ డివిజన్ తెరాస కార్పొరేటర్‌గా గెలిచినందుకు గాను సింధు ఆదర్శ్ రెడ్డి శనివారం ఎంఐజీలోని పోచమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. మాజీ కౌన్సిలర్ మోహన్ గౌడ్‌తో కలిసి ఆమె పూజలు నిర్వహించారు. డివిజన్ ప్రజలు తనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా పనిచేస్తానని, డివిజన్‌ను మరింత అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో తెరాస నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.