శేరిలింగంపల్లి, సెప్టెంబర్ 7 (నమస్తే శేరిలింగంపల్లి): మియాపూర్ సర్కిల్-48 పరిధిలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో మొత్తం 2 ఫిర్యాదులు అందాయి. వీటిలో రెండూ టౌన్ ప్లానింగ్ విభాగానికి సంబంధించినవే. విభాగాల వారీగా చూస్తే.. టౌన్ ప్లానింగ్‌కు 2, రెవెన్యూ, హెల్త్ అండ్ శానిటేషన్, యూసీడీ, ఇంజినీరింగ్, యూబీడీ, ఎలక్ట్రికల్, ఇరిగేషన్, వెటర్నరీ విభాగాలకు ఎలాంటి ఫిర్యాదులు రాలేదు. మొత్తంగా మియాపూర్ సర్కిల్లో ప్రజావాణి కార్యక్రమంలో 2 ఫిర్యాదులు స్వీకరించినట్లు అధికారులు వెల్లడించారు.






