అమీన్‌పూర్ రోడ్ వెడల్పు పనుల పరిశీలన.. మియాపూర్‌లో పారిశుద్ధ్య తనిఖీలు

శేరిలింగంప‌ల్లి, సెప్టెంబ‌ర్ 5 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): అమీన్‌పూర్ రోడ్‌లో చేపడుతున్న రోడ్డు వెడల్పు పనులను సంబంధిత అధికారులు పరిశీలించారు. చందానగర్ ఏసీపీ, ఈఈ, డీవైఈఈ, సీఐలతో కలిసి పనుల పురోగతిని పరిశీలించి అవసరమైన సూచనలు చేశారు. మరోవైపు మియాపూర్ సర్కిల్-48, ఎస్‌ఎల్‌పీజెడ్ పరిధిలోని శంకర్‌నగర్, భవానీ శంకర్‌నగర్ ప్రాంతాల్లో పారిశుద్ధ్య తనిఖీలు నిర్వహించారు. డీవైఈఈ, ఎస్‌ఆర్‌పీతో కలిసి మియాపూర్ సర్కిల్ డిప్యూటీ కమిషనర్ జి. శ్రీనివాస్ ఆయా ప్రాంతాల్లో పర్యటించారు.

ఈ సందర్భంగా స్థానిక రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ల (RWAs) ప్రతినిధులతో మాట్లాడారు. పార్కులు, నాలా ప్రాంతాల్లో జరుగుతున్న వివిధ పనులను పరిశీలించారు. పరిసరాలను పరిశుభ్రంగా, చెత్త రహితంగా ఉంచడంతో పాటు పారిశుద్ధ్య నిర్వహణను మరింత సమర్థవంతంగా చేపట్టాలని సిబ్బందికి అధికారుల సూచించారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here