శేరిలింగంపల్లి, సెప్టెంబర్ 5 (నమస్తే శేరిలింగంపల్లి): రొమ్ము క్యాన్సర్‌పై మహిళలు ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండాలని డాక్టర్ ప్రజ్ఞ చిగురుపాటి అన్నారు. మియాపూర్ నడిగడ్డ తండా లో గ్రాన్యూవల్స్ , ఏఐజి, యుసి బ్రెస్ట్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మహిళలకు ఉచిత రొమ్ము క్యాన్సర్‌పై అవగాహన కల్పించి వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ ప్రజ్ఞ మాట్లాడుతూ ఈ శిబిరంలో 100 మంది మహిళలకు వైద్య పరీక్షలు చేశామని డాక్టర్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో గిరిజన సంక్షేమ సంఘం నడిగడ్డ తండా అధ్యక్షుడు సభవత్ హన్మ నాయక్, ప్రధాన కార్యదర్శి ఇస్లావత్ దశరథ్ నాయక్, ఉపాధ్యక్షులు నాయిని రత్న కుమార్, సుధాకర్ హరి నాయక్, మహిళా సంఘం నాయకులు చాంది బాయి, ఎన్.బుజ్జి బాయి, అన్న పూర్ణ, సుజాత, బుజ్జి బాయి, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.






