శేరిలింగంపల్లి, ఆగస్టు 30 (నమస్తే శేరిలింగంపల్లి): మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని టాటా షోరూం ఎదురుగా ఉన్న ఫ్లైఓవర్ కింద గుర్తుతెలియని వ్యక్తి అనారోగ్యంతో మృతి చెందినట్లు సీఐ కేవీ సుబ్బారావు తెలిపారు. మృతుడి వయసు సుమారు 40 నుంచి 50 సంవత్సరాల మధ్య ఉంటుందని, కొంతకాలంగా భిక్షాటన చేస్తూ జీవిస్తున్నట్లు ప్రాథమికంగా తెలుస్తోందని పేర్కొన్నారు. మృతుడిని ఎవరైనా గుర్తించినట్లయితే వెంటనే మాదాపూర్ పోలీస్ స్టేషన్కు సమాచారం ఇవ్వాలని కోరారు. మృతుడి కుటుంబ సభ్యులు లేదా బంధువుల ఆచూకీ కోసం పోలీసులు వివరాలను సేకరిస్తున్నారు. సమాచారం తెలిసిన వారు మాదాపూర్ ఎస్హెచ్ఓను 8712663109 నంబర్లో సంప్రదించాలని పోలీసులు సూచించారు.






