శేరిలింగంపల్లి, ఆగస్టు 30 (నమస్తే శేరిలింగంపల్లి): కూకట్‌పల్లి హౌసింగ్ బోర్డు (KPHB) కాలనీ 4వ ఫేజ్‌లోని LIG వెంచర్–2 గృహ సముదాయంలో జరిగిన ఎన్నికలు ఉత్కంఠభరితంగా సాగాయి. ఈ ఎన్నికల్లో ప్రెసిడెంట్‌గా మాతంగి మల్లేష్ ఘన విజయం సాధించారు. ఆయనతో పాటు నూతన కార్యవర్గ సభ్యులు ఎన్నికై గృహ సముదాయ అభివృద్ధి, సంక్షేమానికి బాధ్యతలు స్వీకరించనున్నారు. నూతన కార్యవర్గంలో వైస్ ప్రెసిడెంట్‌గా శ్రీనివాస్, జనరల్ సెక్రటరీలుగా హిమబిందు, నాగరాణి, జాయింట్ సెక్రటరీగా విజిత, ట్రెజరర్‌గా అరుణ కుమారి ఎన్నికయ్యారు. ఎగ్జిక్యూటివ్ మెంబర్లుగా నరసింహులు, అశోక్ కుమార్, రాజు, వేణుగోపాల్ ఎన్నికయ్యారు.

నూతన కార్యవర్గం కొలువుదీరడంతో గృహ సముదాయంలోని 630 కుటుంబాల్లో కొత్త ఆశలు చిగురించాయి. దీర్ఘకాలంగా పరిష్కారానికి నోచుకోని వివిధ సమస్యలకు నూతన కార్యవర్గం చొరవతో పరిష్కారం లభిస్తుందని నివాసితులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా పారిశుద్ధ్యం, మౌలిక వసతులు, గృహ సముదాయ అభివృద్ధి, సంక్షేమానికి ప్రాధాన్యం ఇవ్వాలని కోరుతున్నారు. రెసిడెంట్లు ఎదుర్కొంటున్న కేపీహెచ్‌బీ 4వ ఫేజ్ LIG వెంచర్–2 ఎన్నికల్లో మాతంగి మల్లేష్ ఘన విజయంసమస్యలను గుర్తించి సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో పాటు వాటి పరిష్కారానికి నూతన కార్యవర్గం సమన్వయంతో పనిచేయాలని స్థానికులు ఆకాంక్షిస్తున్నారు. గృహ సముదాయాన్ని మరింత అభివృద్ధి చేసి నివాసితులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు కార్యవర్గం కృషి చేయాలని కోరుతున్నారు.
నూతనంగా ఎన్నికైన మాతంగి మల్లేష్‌తో పాటు కార్యవర్గ సభ్యులందరికీ 630 కుటుంబాల నివాసితులు అభినందనలు, శుభాకాంక్షలు తెలిపారు. ప్రజల ఆశలు, ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తూ LIG వెంచర్–2 సమగ్ర అభివృద్ధికి నూతన కార్యవర్గం కృషి చేయాలని వారు ఆకాంక్షించారు.





