పీజేఆర్ స్టేడియంలోని గాంధీ విగ్రహానికి మెట్లు ఏర్పాటు చేయాలి

శేరిలింగంప‌ల్లి, ఆగ‌స్టు 24 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): పీజేఆర్ స్టేడియం ఆవరణలో ఉన్న మహాత్మా గాంధీ విగ్రహానికి స్టీల్ మెట్లు ఏర్పాటు చేయాలని కోరుతూ ప్రజావాణిలో మిద్దెల మల్లారెడ్డి ఫిర్యాదు చేశారు. విగ్రహం ఎత్తులో ఉండటంతో పూలమాలలు వేయడంతో పాటు విగ్రహాన్ని శుభ్రం చేయడం కూడా ఇబ్బందిగా మారిందని ఆయన తెలిపారు. మహాత్మా గాంధీ జయంతి, వర్ధంతి రోజులతో పాటు నియోజకవర్గంలో జరిగే వివిధ కార్యక్రమాల సందర్భంగా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసే ఆనవాయితీ ఉందని మల్లారెడ్డి పేర్కొన్నారు. అయితే ప్రస్తుతం విగ్రహం అందనంత ఎత్తులో ఉండటంతో పూలమాలలు వేయడం కష్టంగా మారిందన్నారు.

ఈ నేపథ్యంలో సీఎంసీ అధికారులు వెంటనే విగ్రహం వద్ద స్టీల్ మెట్లు ఏర్పాటు చేయాలని కోరారు. గతంలో ఈ విగ్రహం జాతీయ రహదారి సమీపంలో ఉన్న సమయంలో స్టీల్ మెట్లు ఏర్పాటు చేసి ఉంటే, అవి ప్రస్తుతం ఎక్కడ ఉన్నాయో గుర్తించి తీసుకొచ్చి అమర్చాలని సూచించారు. పది రోజుల్లోగా అధికారులు స్పందించి మెట్లు ఏర్పాటు చేయకపోతే తామే స్వయంగా స్టీల్ మెట్లు ఏర్పాటు చేస్తామని మిద్దెల మల్లారెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో గంగారం సంగారెడ్డి, జనార్దన్ గౌడ్, రంగారెడ్డి, రాజు యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here