గంగారంలో ఘనంగా శ్రావణ మాసం బోనాల ఉత్సవాలు

శేరిలింగంప‌ల్లి, ఆగ‌స్టు 23 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): శ్రావణ మాసం బోనాల సందర్భంగా గంగారం గ్రామంలోని హుడా కేఫే సమీపంలో ఉన్న జ‌న‌ప్రియ కాల‌నీలో శ్రీ శ్రీ శ్రీ పోచమ్మ అమ్మవారి ఆలయంలో బోనాల ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ ఉత్సవాల్లో శేరిలింగంపల్లి కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జ్, టీపీసీసీ జనరల్ సెక్రటరీ శ్రీ జగదీశ్వర్ గౌడ్, రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి కట్ల శేఖర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, ప్రజల శ్రేయస్సు, ఆయురారోగ్యాలు, సుఖసంతోషాల కోసం ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా ఆలయానికి వచ్చిన భక్తులతో కలిసి బోనాల వేడుకల్లో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here