మాదాపూర్ డివిజన్ బీజేపీ అధ్యక్షుడిగా కొండకల్ ఆనంద్ కుమార్

శేరిలింగంపల్లి, ఆగ‌స్టు 21 (న‌మ‌స్తే శేరిలింగంపల్లి): మాదాపూర్ డివిజన్ (232) బీజేపీ అధ్యక్షుడిగా తనను నియమించినందుకు పార్టీ రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ స్థాయి నాయకులకు కొండకల్ ఆనంద్ కుమార్ కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు, రంగారెడ్డి అర్బన్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు వనిపల్లి శ్రీనివాస్ రెడ్డి, శేరిలింగంపల్లి అసెంబ్లీ బీజేపీ ఇన్‌చార్జ్, రాష్ట్ర అధికార ప్రతినిధి రవి కుమార్ యాదవ్, బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రభాకర్ యాదవ్, జిల్లా బీజేపీ ప్రధాన కార్యదర్శి మహిపాల్ రెడ్డి, మాదాపూర్ డివిజన్ బీజేపీ కాంటెస్టెడ్ కార్పొరేటర్ రాధాకృష్ణ యాదవ్‌తో పాటు నియోజకవర్గ, డివిజన్ సీనియర్ నాయకులు, కార్యకర్తలకు ఆయన హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.

కొత్తగా ఏర్పడిన మాదాపూర్ డివిజన్‌లో బీజేపీని మరింత బలోపేతం చేసేందుకు సీనియర్ నాయకులు, కార్యకర్తలను సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగుతానని ఆనంద్ కుమార్ అన్నారు. రాబోయే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పార్టీ విజయమే లక్ష్యంగా పనిచేస్తామని, మాదాపూర్ డివిజన్‌లో కాషాయ జెండాను ఎగురవేసేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తానని ఆయన పేర్కొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here