శేరిలింగంపల్లి, ఆగస్టు 21 (నమస్తే శేరిలింగంపల్లి): హైదరాబాద్ పర్యటనలో భాగంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని చిర్రా రవీందర్ యాదవ్ ప్రత్యేకంగా కలిశారు. ఈ సందర్భంగా ఇరువురు కొద్దిసేపు ఆత్మీయంగా సమావేశమై పలు అంశాలపై ముచ్చటించారు. ఈ భేటీలో వైఎస్ జగన్.. చిర్రా రవీందర్ యాదవ్ యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. కుటుంబ సభ్యుల పరిస్థితి, ప్రస్తుత కార్యక్రమాలతో పాటు ఇతర అంశాలపై ఆరా తీశారు. చాలాకాలం తర్వాత కలుసుకున్న నేపథ్యంలో ఇరువురి మధ్య సమావేశం ఆత్మీయ వాతావరణంలో సాగినట్లు తెలిసింది.

వైఎస్ జగన్‌తో తనకున్న అనుబంధం నేపథ్యంలో ఈ భేటీకి చిర్రా రవీందర్ యాదవ్ ప్రత్యేక ప్రాధాన్యత ఇచ్చినట్లు సమాచారం. హైదరాబాద్ పర్యటనలో భాగంగా ప్రత్యేకంగా సమయం కేటాయించి జగన్‌ను కలుసుకుని కొద్దిసేపు ముచ్చటించడం రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తించింది. ఈ సందర్భంగా భవిష్యత్ కార్యక్రమాలు, ఇతర రాజకీయ అంశాలపై కూడా ఇరువురు చర్చించినట్లు సమాచారం. వైఎస్ జగన్‌ను కలిసిన అనంతరం చిర్రా రవీందర్ యాదవ్ సంతోషం వ్యక్తం చేశారు.





