హఫీజ్‌పేట్‌లో యూజీడీ పైప్‌లైన్ పనులు.. త్వరితగతిన పూర్తి చేయాలని బాలింగ్ గౌతమ్ గౌడ్ ఆదేశం

శేరిలింగంపల్లి, ఆగ‌స్టు 21 (న‌మ‌స్తే శేరిలింగంపల్లి): హఫీజ్‌పేట్ డివిజన్ యూత్ కాలనీ ఇబ్రహీం మసీద్ పరిసర ప్రాంతాల్లో నూతనంగా నిర్మిస్తున్న యూజీడీ (UGD) పైప్‌లైన్ పనులను కాంగ్రెస్ పార్టీ నాయకుడు బాలింగ్ గౌతమ్ గౌడ్ పరిశీలించారు. ఈ సందర్భంగా పనుల పురోగతిని అధికారులను అడిగి తెలుసుకున్న ఆయన.. పైప్‌లైన్ నిర్మాణ పనులను త్వరితగతిన, నాణ్యతా ప్రమాణాలతో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. పనులు పూర్తయితే స్థానికంగా నెలకొన్న డ్రైనేజీ సమస్యలకు పరిష్కారం లభించి, కాలనీవాసుల ఇబ్బందులు తొలగుతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, కాలనీవాసులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here