నల్లగండ్లలో రాగం సుజాత యాదవ్ దశదినకర్మ.. ప్రముఖుల నివాళులు

శేరిలింగంపల్లి, ఆగ‌స్టు 21 (న‌మ‌స్తే శేరిలింగంపల్లి): నల్లగండ్లలో తెలంగాణ, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సోషల్ వెల్ఫేర్ బోర్డు మాజీ చైర్‌పర్సన్, ప్రముఖ సామాజిక సేవకురాలు రాగం సుజాత యాదవ్ దశదినకర్మ కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించారు. బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతి, మహిళా సాధికారత కోసం ఆమె చేసిన సేవలను పలువురు ప్రముఖులు ఈ సందర్భంగా స్మరించుకున్నారు. నల్లగండ్లలోని వర్టెక్స్ కింగ్స్ పార్క్ విల్లాస్‌లోని ఆమె స్వగృహంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి పీఏసీ చైర్మన్, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ, మాజీ ఎంపీ, బీసీ వెల్ఫేర్ అండ్ డెవలప్‌మెంట్ అడ్వైజర్ వి. హన్మంత్ రావు, మాజీ ఎమ్మెల్సీ భూపాల్ రెడ్డి, మాజీ ఎంపీ గడ్డం రంజిత్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు భిక్షపతి యాదవ్, క్రాంతి కిరణ్, టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి. జగదీశ్వర్ గౌడ్, శేరిలింగంపల్లి బీజేపీ కంటెస్టెడ్ ఎమ్మెల్యే రవికుమార్ యాదవ్ తదితరులు హాజరయ్యారు.

అలాగే రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి మంత్రులు, ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, కార్పొరేటర్లు, సీనియర్ నాయకులు, మహిళా నాయకురాళ్లు, ప్రజాప్రతినిధులు, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, మాజీ కౌన్సిలర్లు, సామాజిక సంఘాల ప్రతినిధులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాగం సుజాత యాదవ్ చిత్రపటానికి పూలమాలలు వేసి ప్రముఖులు ఘనంగా నివాళులర్పించారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. అనంతరం కుటుంబ సభ్యులైన మాజీ కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్, కుమారులు రాగం అనిరుధ్ యాదవ్, రాగం అభిషేక్ యాదవ్‌తో పాటు ఇతర కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. మహిళా సాధికారత, పేద ప్రజల సంక్షేమం కోసం రాగం సుజాత యాదవ్ చేసిన సేవలు చిరస్మరణీయమని పలువురు నాయకులు కొనియాడారు. ఆమె మృతి సామాజిక రంగానికి, బడుగు బలహీన వర్గాలకు తీరని లోటని పేర్కొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here