జగదీశ్వర్ గౌడ్‌తో ఆర్యవైశ్య మహాసభ ప్రతినిధుల ఆత్మీయ సమావేశం

శేరిలింగంపల్లి, ఆగ‌స్టు 19 (న‌మ‌స్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి కంటెస్టెడ్ ఎమ్మెల్యే జగదీశ్వర్ గౌడ్‌ను శేరిలింగంపల్లి మహాసభ, తెలంగాణ రాష్ట్ర మహాసభ, నూతన శేరిలింగంపల్లి మండల మహాసభ కార్యవర్గ సభ్యులు, బస్తీ సంఘాల ప్రతినిధులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆర్యవైశ్య సమాజానికి సంబంధించిన పలు అంశాలపై జగదీశ్వర్ గౌడ్‌తో ఆత్మీయంగా చర్చించారు. నూతనంగా ఎన్నికైన శేరిలింగంపల్లి మండల ఆర్యవైశ్య మహాసభ కార్యవర్గ సభ్యులను జగదీశ్వర్ గౌడ్‌కు పరిచయం చేశారు. అనంతరం సమాజ అభివృద్ధి, సంఘ కార్యకలాపాలు, కమ్యూనిటీకి సంబంధించిన వివిధ అంశాలపై చర్చ జరిగింది.

ఈ కార్య‌క్ర‌మంలో శేరిలింగంపల్లి మండల మహాసభ అధ్య‌క్షుడు మాశెట్టి ప్ర‌భాక‌ర్ గుప్తా, ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి పోలా కోటేశ్వ‌ర్ రావు, కోశాధికారి బి.ఎస్‌.లింగం, వ్య‌వ‌స్థాప‌కుడు గోలి రాజు గుప్తా, ఉపాధ్య‌క్షుడు కొండూరి జ‌గ‌న్మోహ‌న్ గుప్తా, తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ యువజన సంఘం కార్య‌ద‌ర్శి ముక్క పృథ్వీ గుప్తా, శేరిలింగంపల్లి మండల మహిళా సంఘం అధ్యక్షురాలు రేఖా గుప్తా, కొండాపూర్ ఆర్య‌వైశ్య సంఘం అధ్య‌క్షుడు ఆనంద్ ఉప్పుగండ్ల గుప్తా, నాయ‌కులు గంప సంతోష్ గుప్తా , కమలాకర్ యమ్సాని, పాండు గుప్తా, మాశెట్టి శ్రీనివాస్ గుప్తా, కిషోర్ గుప్తా, ఎం.ఎస్. ప్రసాద్, ఎం. పుల్లయ్య, బాలరాజ్ గుప్తా, అశోక్ గుప్తా, కొల్కూరి శ్రీనివాస్ గుప్తా, ⁠దొంతుల సుధాకర్ పాల్గొన్నారు.

వీరితో పాటు పలువురు ఆర్యవైశ్య మహాసభ నాయకులు, సంఘాల ప్రతినిధులు, కమ్యూనిటీ పెద్దలు సమావేశానికి హాజరయ్యారు. తమ విలువైన సమయాన్ని కేటాయించి ఆర్యవైశ్య సమాజ ప్రతినిధులతో ఆత్మీయంగా సమావేశమైన జగదీశ్వర్ గౌడ్‌కు నాయకులు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here