శేరిలింగంపల్లి, ఆగస్టు 15 (నమస్తే శేరిలింగంపల్లి): మియాపూర్ బస్‌స్టాప్ వద్ద 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను 2 వీలర్స్ బైక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహమ్మదీ అన్వర్ షరీఫ్ జాతీయ జెండాను ఆవిష్కరించారు.

ఈ కార్యక్రమంలో 2 వీలర్స్ బైక్ అసోసియేషన్ అధ్యక్షుడు ఫయాజ్ బైక్, ఇలియాస్ షరీఫ్, వజీర్, ఖాజా, సయ్యద్ మోసిన్, అమ్జద్, మహేందర్ ముదిరాజ్, సయ్యద్ రియాజ్ తదితరులు పాల్గొన్నారు. దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడిన మహనీయులను స్మరించుకుంటూ జాతీయ సమైక్యత, దేశభక్తి భావాలను చాటారు.





