శేరిలింగంపల్లి, ఆగస్టు 15 (నమస్తే శేరిలింగంపల్లి): 80వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని అట్టేపల్లి రామప్రభు ఆధ్వర్యంలో మియాపూర్‌లోని ప్రగతి ఎన్‌క్లేవ్ కమ్యూనిటీ హాల్, బాలాజీనగర్‌లో జెండా ఆవిష్కరణ కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జాతీయ జెండాను ఆవిష్కరించి స్వాతంత్ర్య సమరయోధులకు నివాళులర్పించారు. ఈ సందర్భంగా అట్టేపల్లి రామప్రభు మాట్లాడుతూ.. దేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణత్యాగం చేసిన మహనీయులను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలని అన్నారు. దేశ అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా సేవ చేయాలని పిలుపునిచ్చారు. దేశ సమైక్యత, సౌభ్రాతృత్వం, సమగ్రత, ప్రజాస్వామ్య విలువలను కాపాడేందుకు కృషి చేయాలని సూచించారు. ముఖ్యంగా యువత దేశభక్తి, సామాజిక బాధ్యతతో ముందుకు సాగుతూ భారతదేశ ఔన్నత్యాన్ని మరింత పెంచేలా కృషి చేయాలని ఆకాంక్షించారు.

కార్యక్రమంలో ప్రగతి ఎన్‌క్లేవ్ కాలనీ సభ్యులు అట్టేపల్లి పురుషోత్తం, సమ్మెట ప్రసాద్, నాగరాజ్ అడ్వకేట్, హనుమయ్య చౌదరి, చంద్రహాస్, విశాలాక్షి, వాణి, హారతి, చక్రవర్తి, ఖాజా, దయాకర్, సుమన్, వినీత్, రాములు, రాజేంద్ర ప్రసాద్, నాయుడు, శ్రీరాములు, ఎం.డి. ఓమర్ తదితరులు పాల్గొన్నారు. అలాగే బాలాజీనగర్ కాలనీ సభ్యులు ఎ. సంపత్ కుమార్, జి. రాము యాదవ్, సత్యనారాయణ, వెంకటేష్, సుధీర్ కుమార్, పవన్, చంద్ర పాషా, దివ్యభారతి, రాజ్యలక్ష్మి, జి. రవి తదితరులు పాల్గొన్నారు.
ఏఆర్‌పీ టీమ్ సభ్యుల సౌజన్యంతోనూ 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏఆర్‌పీ టీమ్ సభ్యులు అరేపాగ దేవేందర్, అజయ్ పటేల్, ప్రశాంత్ పటేల్, ప్రవీణ్ పటేల్, తాడికొండ ప్రదీప్, కదారి రాజు, కోటంగారి శ్రీను, ముద్దాపురం సాయి గౌడ్, శేఖర్ ముదిరాజ్, పల్లపు శ్రీను, మంచికలపాటి నరసింహ, కుంచాల తరుణ్, బోస్తు నవీన్, సంపంగి గణేష్, సంపంగి శివ, మహేష్ ముదిరాజ్, సంపంగి హనుమంతు, పవన్ చక్రవర్తి, సంగనమోని మధు, తన్నేరు శ్రీకాంత్, గిరిధర్ తదితరులు పాల్గొన్నారు.





