శేరిలింగంపల్లి, ఆగస్టు 13 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి నియోజకవర్గం హఫీజ్‌పేట్ డివిజన్‌లో హర్ ఘర్ తిరంగా యాత్రను ఘనంగా నిర్వహించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపు మేరకు చేపట్టిన హర్ ఘర్ తిరంగా అభియాన్ లో భాగంగా డివిజన్ బీజేపీ అధ్యక్షుడు కైతాపురం జితేందర్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ యాత్రలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు, హర్ ఘర్ తిరంగా కన్వీనర్ డాక్టర్ అజిత్ కుమార్ సేనాపతి, రంగారెడ్డి అర్బన్ జిల్లా బీజేపీ ప్రధాన కార్యదర్శి తోపుగొండ మహిపాల్ రెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రతి ఇంటిపై జాతీయ జెండాను ఎగురవేసి దేశభక్తి స్ఫూర్తిని చాటాలని పిలుపునిచ్చారు. దేశ ఐక్యత, జాతీయ సమైక్యత కోసం ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని కోరారు. వికసిత్ భారత్ 2047 లక్ష్య సాధనలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారని తెలిపారు. కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకుడు, TAC మెంబర్ పోరెడ్డి బుచ్చిరెడ్డి, బీజేపీ రాష్ట్ర మాజీ కౌన్సిల్ సభ్యుడు కలివేముల మనోహర్, కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు నరసింహా రావు, నాయకులు రాజశేఖర్, మాజీ కౌన్సిలర్ రమణయ్య, జిల్లా కార్యవర్గ సభ్యులు రవి గౌడ్, శ్రీధర్ రావు, జిల్లా కౌన్సిల్ సభ్యులు ఆళ్ల వరప్రసాద్, నాయకురాలు పార్వతీ, నాయకులు పవన్, సురేష్ కురుమ తదితరులు పాల్గొన్నారు.
హఫీజ్‌పేట్ డివిజన్ బీజేపీ ప్రధాన కార్యదర్శి జగన్ గౌడ్, మారెళ్ల వెంకటేశ్వర్లు, డివిజన్ ఉపాధ్యక్షులు ప్రసాద్ పాత్రో, రాజు యాదవ్‌తో పాటు మోహన్ ముదిరాజ్, శేఖర్ ముదిరాజ్, రామ్ రెడ్డి, రామచంద్ర యాదవ్, అశోక్ ముదిరాజ్, కృష్ణకాంత్, నాగేష్ తదితర నాయకులు, వివిధ మోర్చాల నాయకులు, కార్యకర్తలు, ప్రైవేట్ కళాశాల విద్యార్థులు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.





