శేరిలింగంపల్లి, ఆగస్టు 7 (నమస్తే శేరిలింగంపల్లి): వికారాబాద్ జిల్లా బీజేపీ జిల్లా అధ్యక్షుడిగా నూతనంగా నియమితులైన రమేష్ తాండూరులోని బీజేపీ రాష్ట్ర నాయకుడు, రంగారెడ్డి జిల్లా పరిషత్ మాజీ వైస్ చైర్మన్ ఎస్. నందకుమార్ యాదవ్ నివాసానికి మర్యాదపూర్వకంగా వెళ్లి కలిశారు. ఈ సందర్భంగా నందకుమార్ యాదవ్ రమేష్‌కు పుష్పగుచ్ఛం అందించి అభినందనలు తెలిపారు. పార్టీ బలోపేతానికి కృషి చేస్తూ భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులు చేపట్టాలని ఆకాంక్షించారు. రమేష్‌కు లభించిన ఈ బాధ్యతను విజయవంతంగా నిర్వర్తించి పార్టీకి మరింత సేవ చేయాలని నందకుమార్ యాదవ్ శుభాకాంక్షలు తెలిపారు.






