బోనాల వేడుకలకు మాధవరం కృష్ణారావుకు ఆహ్వానం

శేరిలింగంప‌ల్లి, ఆగ‌స్టు 7 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): శేరిలింగంపల్లి నియోజకవర్గం బీఆర్ఎస్‌ ఇంచార్జ్, ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావును హఫీజ్‌పేట్ డివిజన్ నాయకులు బోనాల మహోత్సవాలకు ఆహ్వానించారు. హఫీజ్‌పేట్ డివిజన్‌కు చెందిన నిమ్మల శేఖర్ గౌడ్, నిమ్మల రామకృష్ణ గౌడ్, మిద్దెల మల్లారెడ్డి తదితరులు మర్యాదపూర్వకంగా కలిసి ఆహ్వాన పత్రికను అందజేశారు. ఈ సందర్భంగా హఫీజ్‌పేట్ గ్రామంలోని శ్రీ పోచమ్మ దేవాలయంలో నిర్వహించే బోనాల ఉత్సవాలకు, అలాగే మదీనాగూడ డివిజన్ పరిధిలోని హుడా కాలనీలో అమ్మవారి బోనాల వేడుకలకు హాజ‌రై భక్తులను ఆశీర్వదించాలని మాధవరం కృష్ణారావును వారు కోరారు. ఈ సందర్భంగా బోనాల ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు నాయకులు తెలిపారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here