కొండాపూర్ ప్రజలకు షేక్ చాంద్ పాషా హామీ

శేరిలింగంప‌ల్లి, ఆగ‌స్టు 7 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): కొండాపూర్, అంజయ్యనగర్ డివిజన్లకు చెందిన ప్రజలు తమకు సంబంధించిన రేషన్ కార్డులు, డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల కేటాయింపు, వృద్ధాప్య పింఛన్లు తదితర సమస్యలను షేక్ చాంద్ పాషా దృష్టికి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా ప్రజల సమస్యలను ఎమ్మెల్యే ఆరెక‌పూడి గాంధీ దృష్టికి తీసుకెళ్లి, వాటి పరిష్కారం కోసం అధికారులతో సమన్వయం చేసి త్వరితగతిన చర్యలు తీసుకునేలా కృషి చేస్తానని షేక్ చాంద్ పాషా హామీ ఇచ్చారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తానని ఆయన తెలిపారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here