మియాపూర్‌లో SIR ఓటర్ నమోదు కేంద్రాల పరిశీలన

శేరిలింగంప‌ల్లి, ఆగ‌స్టు 4 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) ఓటర్ క్రమబద్ధీకరణ కార్యక్రమంలో భాగంగా మియాపూర్ డివిజన్‌లో కొనసాగుతున్న ఓటర్ నమోదు ప్రక్రియను కాంగ్రెస్ పార్టీ నాయకురాలు, మాజీ వార్డ్ కమిటీ సభ్యురాలు సంగీత వీరేందర్ గౌడ్ మంగళవారం పరిశీలించారు. విడియా కాలనీ, ప్రగతి ఎన్‌క్లేవ్ కమిటీ హాల్, జేపీ నగర్ కమిటీ హాల్‌లో ఏర్పాటు చేసిన SIR కేంద్రాలను సందర్శించిన ఆమె, ఓటర్ నమోదు ప్రక్రియ పురోగతిపై వివరాలు తెలుసుకున్నారు. ఇప్పటికే ఎంత మంది నమోదు చేసుకున్నారో, ఇంకా నమోదు చేసుకోవాల్సిన వారి సంఖ్య ఎంత ఉందో సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు.

ఆగస్టు 10వ తేదీలోగా అర్హులైన ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా SIR ఓటర్ నమోదు ప్రక్రియను పూర్తి చేసుకోవాలని సంగీత వీరేందర్ గౌడ్ పిలుపునిచ్చారు. కేంద్రాల్లో విధులు నిర్వహిస్తున్న బీఎల్‌వోలు (BLOలు), బీఎల్‌ఏల (BLAలు) పనితీరును కూడా ఆమె సమీక్షించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ఐఎన్‌టీయూసీ నాయకుడు నల్ల సంజీవరెడ్డి, టీపీసీసీ లేబర్ సెల్ రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి వీరమల్ల వీరేందర్ గౌడ్, ఉయ్యూరు శ్రీదేవి, డీసీసీ రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ కమిటీ కార్యదర్శి ముద్దంగుల తిరుపతి, రంగారెడ్డి జిల్లా యువజన కాంగ్రెస్ కార్యదర్శి మన్నే నరేందర్ ముదిరాజ్, మియాపూర్ డివిజన్ లేబర్ సెల్ అధ్యక్షుడు దయాకర్ రెడ్డి, బ్రహ్మానందం నాగరాజు, అజయ్ రెడ్డి, ఉయ్యూరు రామారావు, కాలనీవాసులు మహేష్ రెడ్డి, వెంకట్ రెడ్డి, మోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here