గోపన్‌పల్లి శ్మశానవాటిక దుస్థితిపై రాగం హరిశంకర్ యాదవ్ ఆగ్రహం

శేరిలింగంప‌ల్లి, ఆగ‌స్టు 4 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): నల్లగండ్ల డివిజన్ పరిధిలోని గోపన్‌పల్లి శ్మశానవాటికలో నెలకొన్న సమస్యలపై బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు రాగం హరిశంకర్ యాదవ్ స్పందించారు. శంకరి రాజు ముదిరాజ్‌తో పాటు గ్రామ ప్రజలు శ్మశానవాటికలోని సమస్యలను వివరించి పరిశీలించాలని కోరడంతో ఆయన మంగళవారం అక్కడికి వెళ్లి పరిస్థితులను ప్రత్యక్షంగా పరిశీలించారు.

పరిశీలన సందర్భంగా శ్మశానవాటికలో చెత్త పేరుకుపోవడం, రాత్రి వేళల్లో మద్యం సేవించడం, ప్రధాన గేట్లు, ప్రహరీ గోడ, వాష్‌రూమ్‌లు పూర్తిగా దెబ్బతినడం, వీధి విద్యుత్ దీపాలు, విద్యుత్ స్తంభాలు ధ్వంసమవడం, పరిసరాలు అపరిశుభ్రంగా ఉండడం వంటి సమస్యలను గుర్తించారు. ఈ సందర్భంగా రాగం హరిశంకర్ యాదవ్ మాట్లాడుతూ శ్మశానవాటికలో ఉన్న సమస్యలను వెంటనే జీహెచ్‌ఎంసీ అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. దెబ్బతిన్న గేట్లు, వాష్‌రూమ్‌లు, స్ట్రీట్ లైట్లు తదితర మౌలిక వసతులను పునరుద్ధరించడంతోపాటు శ్మశానవాటిక పరిసరాలను పరిశుభ్రంగా ఉంచేందుకు అవసరమైన చర్యలు చేపట్టేలా కృషి చేస్తామని స్థానిక ప్రజలకు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మాల బేగరి కాటికాపర్ల సంఘం అధ్యక్షుడు బి. పోచయ్య, రమేష్, నరసింహ, రవికుమార్, అరుణ్, పరశురామ్, నరేష్, లోకేష్, చరణ్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here