గచ్చిబౌలి బోనాల వేడుకల్లో మాజీ కార్పొరేటర్ సాయిబాబా

శేరిలింగంప‌ల్లి, ఆగ‌స్టు 4 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బోనాల పండుగ సందర్భంగా శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని గచ్చిబౌలి డివిజన్ మధురానగర్ కాలనీలో మంగళవారం ఘనంగా బోనాల వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకల్లో శేరిలింగంపల్లి సీనియర్ నాయకుడు, గచ్చిబౌలి డివిజన్ మాజీ కార్పొరేటర్ కొమిరిశెట్టి సాయిబాబా పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులకు ప్రసాదం పంపిణీ చేసి, ప్రజలకు బోనాల పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా సాయిబాబా మాట్లాడుతూ తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలను భావితరాలకు అందించే బాధ్యత ప్రతి ఒక్కరిపైనా ఉందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పెద్దగోని రమేష్ గౌడ్, రావులకోలు గోవింద్, వెంకటేష్, జగదీష్, సంగమేష్, నర్సింహ గౌడ్, దార్గుపల్లి నరేష్, స్థానిక నాయకులు, కార్యకర్తలు, కాలనీ వాసులు, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here