శాకంబరి ఉత్సవాల్లో పాల్గొన్న యాదవ కార్పొరేషన్ చైర్మన్ రఘునాథ్ యాదవ్

శేరిలింగంప‌ల్లి, జూలై 31 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): శ్రీరామ్ నగర్ కాలనీలోని శ్రీ సీతారామ స్వామి దేవాలయంలో నిర్వహించిన శాకంబరి ఉత్సవాల్లో యాదవ కార్పొరేషన్ చైర్మన్ రఘునాథ్ యాదవ్ పాల్గొన్నారు. ఆలయ కమిటీ ఆహ్వానం మేరకు విచ్చేసిన ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారి ఆశీస్సులు పొందారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు రఘునాథ్ యాదవ్‌ను ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షుడు ఎల్లారెడ్డి, శేరిలింగంపల్లి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బలరామ్ యాదవ్, రాజమోహన్ రావు, ఓబుల్ రెడ్డి, నాగరాజు యాదవ్, వెంకటేశ్వర్లు, వెంకటరామయ్య, అనంత రెడ్డి, సన్నీ యాదవ్‌తోపాటు ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here