శేరిలింగంపల్లి ప్రజావాణిలో వినతుల వెల్లువ

శేరిలింగంపల్లి, జూలై 27 (న‌మ‌స్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి జోనల్ కార్యాలయంలో సోమవారం ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజల నుంచి వివిధ సమస్యలకు సంబంధించిన వినతిపత్రాలను స్వీకరించిన జోనల్ కమిషనర్ నారాయణ్ అమిత్ ఆయా సమస్యలపై అధికారులతో కలిసి సమీక్ష నిర్వహించారు. పురపాలక సేవలకు సంబంధించిన పలు అంశాలపై ప్రజలు తమ ఫిర్యాదులు, వినతులను అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. అందిన ప్రతి ఫిర్యాదును క్షుణ్ణంగా పరిశీలించాలని, సంబంధిత శాఖల అధికారులు తక్షణమే స్పందించి సమస్యల పరిష్కారానికి అవసరమైన చర్యలు చేపట్టాలని జోనల్ కమిషనర్ అధికారులను ఆదేశించారు. ప్రజల సమస్యలను సమర్థవంతంగా, వేగంగా పరిష్కరించడం ద్వారా ప్రజాభిముఖ, పారదర్శక పాలన అందించడమే తమ లక్ష్యమని జోనల్ కమిషనర్ నారాయణ్ అమిత్ తెలిపారు. ప్రజావాణి కార్యక్రమం ప్రజలకు ప్రభుత్వ సేవలను మరింత చేరువ చేసే వేదికగా నిలుస్తోందని ఆయన పేర్కొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here