వంద శాతం ఓటరు సర్వే పూర్తి చేయాలి.. ఎస్‌ఐఆర్ ఎన్యుమరేషన్ క్షేత్రస్థాయిలో పరిశీల‌న..

శేరిలింగంప‌ల్లి, జూలై 24 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): ఎస్‌ఐఆర్ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్) ఓటరు ఎన్యుమరేషన్ ప్రక్రియలో భాగంగా శేరిలింగంపల్లి మాజీ కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ డివిజన్ పరిధిలోని పాపిరెడ్డి కాలనీ, రాజీవ్ గృహకల్ప, నెహ్రూనగర్, గోపినగర్ ప్రాంతాల్లో క్షేత్రస్థాయిలో పర్యటించి బూత్‌ల వారీగా సర్వే తీరును పరిశీలించారు. ఈ సందర్భంగా ఇంటింటికీ వెళ్లి ఎన్యుమరేటర్లు నిర్వహిస్తున్న ఓటరు సర్వే వివరాలను అడిగి తెలుసుకున్నారు. డివిజన్‌లో ఓటరు ఎన్యుమరేషన్ శాతం తక్కువగా నమోదైన బూత్‌లను ప్రత్యేకంగా పరిశీలించి, అక్కడ సర్వే మందకొడిగా సాగడానికి గల కారణాలను బూత్ ఇన్‌చార్జ్‌లు, అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రతి ఇంటిని తప్పనిసరిగా సందర్శించి ఒక్క ఓటరుని కూడా విస్మరించకుండా వివరాలు నమోదు చేయాలని ఎన్యుమరేటర్లకు సూచించారు.

ఈ సందర్భంగా రాగం నాగేందర్ యాదవ్ మాట్లాడుతూ ఎస్‌ఐఆర్ సర్వే అత్యంత కీలకమైన ప్రక్రియ అని, ఈ వివరాల ఆధారంగానే ఓటరు జాబితా రూపొందుతుందని తెలిపారు. కొన్ని బూత్‌ల‌లో ఎన్యుమరేషన్ శాతం తక్కువగా ఉండటం గమనించామని, అక్కడ ఇంకా సర్వే పూర్తికాని ఇళ్లు ఉండే అవకాశం ఉన్నందున ప్రతి బూత్ ఇన్‌చార్జ్ అప్రమత్తంగా వ్యవహరించి 100 శాతం సర్వే పూర్తి చేయాలని సూచించారు. సర్వే ప్రక్రియను పూర్తిగా పారదర్శకంగా నిర్వహించాలని, ఎలాంటి పక్షపాతం లేకుండా ప్రతి అర్హ ఓటరు వివరాలను నమోదు చేయాలని అన్నారు. ఉద్దేశపూర్వకంగా ఓటర్లను విస్మరించే ప్రయత్నాలు జరిగితే సంబంధిత సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షుడు రాజు యాదవ్, ప్రధాన కార్యదర్శి రవీందర్ గౌడ్, వార్డు మెంబర్ శ్రీకళ, గడ్డం రవి యాదవ్, శ్రీకాంత్ దేవులపల్లి, ఎల్లదాస్, కుమార్, కుటుంబరావు, నర్సింహారావు, మహేందర్ సింగ్, కిరణ్ యాదవ్, సాయి, మహిళా నాయకులు సౌజన్య, భాగ్యలక్ష్మి, జయ, కళ్యాణి, సుధారాణి, బూత్ ఇన్‌చార్జ్‌లు, ఎన్యుమరేటర్లు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here