ఛత్రోన్ కీ గూంజ్‌ను విజ‌య‌వంతం చేయాలి: జగదీశ్వర్ గౌడ్

శేరిలింగంప‌ల్లి, జూలై 21 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) నాయకుడు రాహుల్ గాంధీ ఆలోచనలు, ఆదేశాల మేరకు భారత జాతీయ కాంగ్రెస్, భారత యువజన కాంగ్రెస్, ఎన్ఎస్‌యూఐ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా చేపడుతున్న ఛత్రోన్ కీ గూంజ్ జాతీయ విద్యార్థి ఉద్యమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ వి. జగదీశ్వర్ గౌడ్ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు, యూత్ కాంగ్రెస్, మహిళా కాంగ్రెస్, ఎన్ఎస్‌యూఐ నాయకులతో కలిసి జగదీశ్వర్ గౌడ్ ఛత్రోన్ కీ గూంజ్ కార్యక్రమ పోస్టర్‌ను ఆవిష్కరించారు. విద్యార్థుల సమస్యలు, హక్కుల పరిరక్షణ కోసం నిర్వహిస్తున్న ఈ జాతీయ ఉద్యమంలో విద్యార్థులు, యువత పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని ఆయన కోరారు. చందాన‌గ‌ర్‌లోని పీజేఆర్ స్టేడియంలో బుధ‌వారం ఉద‌యం 9:30 గంట‌ల‌కు నిర్వ‌హించ‌నున్న ఛ‌త్రోన్ కీ గూంజ్ కార్య‌క్ర‌మంలో అంద‌రూ పాల్గొని జ‌య‌ప్ర‌దం చేయాల‌ని అన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here