వివేకానందనగర్ (నమస్తే శేరిలింగంపల్లి): డివిజన్ పరిదిలోని సప్తగిరి కాలనీలో బిజెపి నాయకులు భాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో తెలంగాణ విమోచన దినోత్సవం అదేవిధంగ భారత ప్రధాని నరేంద్ర మోదీ జన్మదిన వేడుకలు గురువాగం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా విచ్చేసిన బీజేపీ నాయకులు ఉప్పల ఏకాంత్ గౌడ్ మువ్వన్నెల జెండా ఆవిష్కరించారు. అనంతరం మోడి జన్మదినాన్ని పురస్కరించుకొని స్థానికంగ మొక్కలు. ఈ కార్యక్రమంలో డివిజన్ నాయకులు అరవింద్ యాదవ్, అశోక్, రమేష్, పుష్పేందర్, అనిల్, భాస్కర్, తదితరులు పాల్గొన్నారు.