శేరిలింగంపల్లి, జూన్ 25 (నమస్తే శేరిలింగంపల్లి): అల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని తులసి నగర్ కాలనీలో ఉన్న శ్రీ శ్రీ శ్రీ లీలాద్రి శ్రీ లక్ష్మీనరసింహ స్వామి క్షేత్ర దేవస్థానంలో శ్రీ లీలాద్రి క్షేత్రం ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ మాధవరం కాంతారావుతో కలిసి పీఏసీ చైర్మన్ ఆరెకపూడి గాంధీ ముఖ్యఅతిధిగా పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో నాయకుడు నాయినేనీ చంద్రకాంత్ రావు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.






