బీఆర్ఎస్ కు గుడ్‌బై.. టీఆర్ఎస్‌లో చేరిన వాసిలి చంద్రశేఖర్ ప్రసాద్

శేరిలింగంప‌ల్లి, జూన్ 25 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): తాను, తన సతీమణి వాసిలి నివేదితతోపాటు తన అభిమానులు, మిత్రులు కలిసి టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత నాయకత్వంలో ఆ పార్టీలో చేరినట్లు వాసిలి చంద్రశేఖర్ ప్రసాద్ తెలిపారు. ఈ సందర్భంగా ఇప్పటివరకు తనపై ప్రేమాభిమానాలు చూపిన ప్రతి ఒక్కరికీ పేరు పేరునా కృతజ్ఞతలు తెలియజేశారు. భవిష్యత్తులో కూడా ఇదే ఆదరణ, అభిమానం టీఆర్ఎస్ పార్టీలో తనకు అందించాలని ఆయన అభిమానులు, మిత్రులను కోరారు. ప్ర‌జ‌లు త‌న‌పై చూపిన విశ్వాసం, ప్రేమకు ఎల్లప్పుడూ రుణపడి ఉంటాన‌ని, ఇకపై టీఆర్ఎస్‌ పార్టీ బలోపేతానికి త‌న‌ వంతు కృషి చేస్తాన‌ని తెలిపారు. అందరూ త‌న‌కు అండగా నిలవాలని కోరుకుంటున్నాన‌ని వాసిలి చంద్రశేఖర్ ప్రసాద్ పేర్కొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here