ఓటర్లకు కీలక సమాచారం.. శేరిలింగంపల్లిలో SIR-2026 హెల్ప్‌లైన్ డెస్క్ ఏర్పాటు

శేరిలింగంప‌ల్లి, జూన్ 25 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో 2026 సంవత్సర ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR-2026) కార్యక్రమాన్ని అధికారులు చేపట్టారు. ఈ సందర్భంగా ఓటర్లకు అవసరమైన సేవలను అందించేందుకు ప్రత్యేక హెల్ప్‌లైన్ డెస్క్ ఏర్పాటు చేసినట్లు ఈఆర్వో, జోనల్ కమిషనర్ నారాయణ్ అమిత్ తెలిపారు. ఓటర్ల జాబితాలో కొత్త పేర్ల నమోదు, పేర్ల తొలగింపు, వివరాల సవరణ, చిరునామా మార్పులు వంటి సేవలకు సంబంధించిన సందేహాలు, ఫిర్యాదుల కోసం ప్రజలు హెల్ప్‌లైన్‌ను సంప్రదించవచ్చని వెల్లడించారు. హెల్ప్‌లైన్ నంబర్ 9390277280ను ఉదయం 10:30 గంటల నుంచి సాయంత్రం 5:00 గంటల వరకు సంప్ర‌దించ‌వ‌చ్చ‌ని తెలిపారు.

ఓటర్ల జాబితాకు సంబంధించి ఏవైనా సమస్యలు లేదా సందేహాలు ఉంటే స‌ద‌రు నంబర్‌కు కాల్ చేసి అవసరమైన సమాచారం పొందాలని అధికారులు సూచించారు. ప్రజలందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకొని ఓటర్ల జాబితాలో తమ వివరాలను పరిశీలించి, అవసరమైన మార్పులు చేయించుకోవాలని ఈఆర్వో నారాయణ్ అమిత్ కోరారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here