శేరిలింగంపల్లి, జూన్ 23 (నమస్తే శేరిలింగంపల్లి): హైదరాబాద్‌లో విప్లవాత్మక ఏఐ స్టార్టప్ పాంటిస్ వెబ్‌సైట్‌ను మాజీ ఐటీ మంత్రి కేటీఆర్ ఘనంగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సంస్థ సీఈవో శరత్, డైరెక్టర్లు వినయ్, ప్రతీక్ల ప్రతిభను, వారి వినూత్న సాంకేతిక దృక్పథాన్ని కేటీఆర్ ప్రత్యేకంగా అభినందించారు. సాంకేతిక రంగంలో యువ పారిశ్రామికవేత్తలు కొత్త ఆవిష్కరణలతో ముందుకు రావడం తెలంగాణకు గర్వకారణమని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రం అంతర్జాతీయ స్థాయిలో స్టార్టప్‌లు, సరికొత్త ఆవిష్కరణలకు ప్రధాన కేంద్రంగా ఎదుగుతోందని ఆయన కొనియాడారు. ప్రపంచ స్థాయి సాంకేతిక ఉత్పత్తులను అభివృద్ధి చేసే సంస్థలకు రాష్ట్రం అనుకూల వాతావరణాన్ని కల్పిస్తోందని చెప్పారు. హెచ్ఆర్ రిక్రూట్మెంట్ ప్రక్రియను మరింత సులభతరం చేసే డీప్-టెక్ ఆధారిత పాంటిస్ ఉత్పత్తి గ్లోబల్ మార్కెట్లో విశేష విజయాలు సాధించాలని ఆకాంక్షిస్తూ, సంస్థ బృందానికి కేటీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు, ఉప్పల్ ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు సిద్దనబోయిన పురుషోత్తం యాదవ్ పాల్గొన్నారు.






