శేరిలింగంపల్లి, జూన్ 23 (నమస్తే శేరిలింగంపల్లి): పాండిచ్చేరిలో జరగనున్న 2వ ఫెడరేషన్ కప్ వాలీబాల్ టోర్నమెంట్‌కు చందానగర్ పీజేఆర్ స్టేడియం విద్యార్థులు పి.సందీప్, వి.అక్షర రెడ్డి ఎంపికయ్యారు. తెలంగాణ రాష్ట్ర జట్టులో భాగంగా వారు ఆ టోర్నమెంటలో పాల్గొననున్నారు. ఈ నెల 26 నుంచి 28వ తేదీ వరకు టోర్నమెంట్ జరగనుంది. ఈ సందర్భంగా టోర్నమెంట్‌కు రాష్ట్రస్థాయి జట్టుకు ఎంపికైనందుకు కోచ్‌లు, సహ క్రీడాకారులు వారికి అభినందనలు తెలిపారు. టోర్నమెంట్‌లో సత్తా చాటి రాష్ట్రానికి పేరు తేవాలని ఆకాంక్షించారు.






