రాహుల్ గాంధీ జన్మదినం సందర్భంగా రోగులకు పండ్లు పంపిణీ

శేరిలింగంప‌ల్లి, జూన్ 19 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): ఏఐసీసీ నాయ‌కుడు, ఎంపీ రాహుల్ గాంధీ జ‌న్మ‌దినం సంద‌ర్భంగా కాంగ్రెస్ నాయకుడు మిరియాల ప్రీతమ్ ఆధ్వర్యంలో కొండాపూర్ ప్రభుత్వ ఆసుపత్రిలో సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న 120 మంది రోగులకు పండ్లు, ఆహార పదార్థాలు పంపిణీ చేసి వారి ఆరోగ్య పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందిస్తున్న జిల్లా వైద్యాధికారి చంద్రకృష్ణను మిరియాల ప్రీతమ్ శాలువాతో సన్మానించి అభినందించారు. వైద్య రంగంలో ఆయన అందిస్తున్న సేవలను కొనియాడుతూ, ప్రజారోగ్య పరిరక్షణలో వైద్య సిబ్బంది పాత్ర కీలకమని పేర్కొన్నారు.

ఈ సందర్భంగా మిరియాల ప్రీతమ్ మాట్లాడుతూ రాహుల్ గాంధీ దేశ యువతకు, సామాన్య ప్రజలకు స్ఫూర్తిదాయక నాయకుడని అన్నారు. సమాజ సేవే లక్ష్యంగా ఆయన చేస్తున్న కృషి అందరికీ ఆదర్శమని కొనియాడారు. ఈ కార్యక్రమం సేవా భావానికి ప్రతీకగా నిలిచిందని తెలిపారు. కార్యక్రమంలో పరదేశి నాయుడు, విష్ణుమూర్తి, శ్రీను, చలం, కృష్ణమూర్తి, రామాంజనేయులు, త్రిలోచ్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here