శేరిలింగంపల్లి, జూన్ 19 (నమస్తే శేరిలింగంపల్లి): కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ జన్మదినం సందర్భంగా హఫీజ్పేట్ ప్రభుత్వ పాఠశాలలో కాంగ్రెస్ నాయకుడు బాలింగ్ గౌతమ్ గౌడ్ ఆధ్వర్యంలో శుక్రవారం వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల ఆవరణలో కేక్ కట్ చేసి విద్యార్థులకు స్వీట్లు పంపిణీ చేశారు. అనంతరం గౌతమ్ గౌడ్ చేతుల మీదుగా విద్యార్థులకు ఉచితంగా పుస్తకాలు, పెన్సిల్ కిట్లను అందజేశారు. విద్యాభివృద్ధికి తోడ్పడే కార్యక్రమాలను కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ ప్రోత్సహిస్తుందని ఆయన పేర్కొన్నారు. దేశ ప్రజల సంక్షేమం, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం రాహుల్ గాంధీ నిరంతరం కృషి చేస్తున్నారని కొనియాడారు. ప్రజల సమస్యలపై నిరంతరం పోరాడుతూ రాజ్యాంగ విలువలను కాపాడేందుకు ఆయన చేస్తున్న ప్రయత్నాలు యువతకు స్ఫూర్తిదాయకమని అన్నారు.

రాబోయే రోజుల్లో రాహుల్ గాంధీ దేశ ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టాలని తాము ఆకాంక్షిస్తున్నామని గౌతమ్ గౌడ్ తెలిపారు. దేశ భవిష్యత్తును సానుకూల దిశగా నడిపించే నాయకత్వం ఆయనకు ఉందని అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులతోపాటు స్థానిక నాయకులు జమీర్ (లిమ్ర), జ్ఞానేశ్వర్, వీరేందర్, గోపి, సుధీష్, జహీర్, రాము, ఇమ్రాన్, వికాస్ తదితరులు పాల్గొన్నారు.





