విష్ణువర్ధన్ రెడ్డి జయంతి సందర్భంగా రక్తదాన శిబిరం

శేరిలింగంప‌ల్లి, జూన్ 6 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని నల్లగండ్ల డివిజన్ నల్లగండ్ల విలేజ్‌లో విష్ణువర్ధన్ రెడ్డి జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి శేరిలింగంపల్లి మాజీ కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరం, ఉచిత వైద్య పరీక్షల కార్యక్రమాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రక్తదానం మహోన్నతమైన సేవ అని, ఒకరి రక్తదానం మరొకరి ప్రాణాలను కాపాడగలదని అన్నారు. ప్రతి యువకుడు సామాజిక బాధ్యతగా రక్తదాన కార్యక్రమాల్లో పాల్గొని సేవాభావాన్ని చాటాలని పిలుపునిచ్చారు. ఉచిత వైద్య పరీక్షల ద్వారా పేద, మధ్యతరగతి ప్రజలకు ఆరోగ్య సేవలు అందుబాటులోకి వస్తాయని, ఇటువంటి కార్యక్రమాలు సమాజానికి ఎంతో ఉపయోగకరమని తెలిపారు. ఈ కార్యక్రమంలో మిరియాల‌ రాఘవరావు, రాజిరెడ్డి, అమరేందర్ రెడ్డి, సత్యనారాయణ రెడ్డి, విష్ణువర్ధన్ రెడ్డి, విజయేందర్ రెడ్డి, రాగం మల్లికార్జున్ యాదవ్, గౌతమ్, శ్రీనివాస్ రెడ్డి, స్థానిక నాయకులు, కార్యకర్తలు, యువకులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here