శేరిలింగంపల్లి, జూన్ 6 (నమస్తే శేరిలింగంపల్లి): అన్నదానం మహాదానం అనే స్ఫూర్తితో మియాపూర్లో అట్టేపల్లి లక్ష్మీనారాయణ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆరో శనివారం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ట్రస్ట్ చైర్మన్ అట్టేపల్లి రామప్రభు నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో వందలాది మంది ప్రజలకు భోజనాన్ని అందించారు. ఈ సందర్భంగా అట్టేపల్లి పురుషోత్తం మాట్లాడుతూ వందలాది మంది ఆకలిని తీర్చడం ఎంతో ఆనందంగా ఉందని తెలిపారు. సమాజ సేవలో భాగంగా ఇటువంటి కార్యక్రమాలను నిరంతరం కొనసాగిస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీరాములు, దయాకర్, తేజ, అజయ్, వినీత్, కరుణాకర్, శివయ్య, సతీష్, రాంచరణ్, రామబాణం, శోభారాణి, కల్పన, కవిత, జ్యోతి, అట్టేపల్లి లక్ష్మీనారాయణ చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు, ఏఆర్పీ టీమ్ సభ్యులు పాల్గొన్నారు.






