హఫీజ్‌పేట్‌లో బీజేపీ కీలక సమావేశం.. SIR, ఓటరు జాబితా పరిశీలనపై కార్యకర్తలకు దిశానిర్దేశం..

శేరిలింగంప‌ల్లి, జూన్ 6 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): హఫీజ్‌పేట్ డివిజన్‌లో బీజేపీ కార్యవర్గ సమావేశంతోపాటు SIR (Special Intensive Revision) అంశంపై డివిజన్ స్థాయి ముఖ్య సమావేశం ఇంజనీర్ ఎన్‌క్లేవ్‌లో నిర్వహించారు. ఈ సమావేశానికి హఫీజ్‌పేట్ డివిజన్ బీజేపీ అధ్యక్షుడు కైతాపురం జితేందర్ అధ్యక్షత వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా బీజేపీ SIR రాష్ట్ర కమిటీ సభ్యుడు పొన్న వెంకటరమణ, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు డాక్టర్ అజిత్ కుమార్ సేనాపతి, బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి మహిపాల్ రెడ్డి, జిల్లా కార్యదర్శి మాణిక్ రావు హాజరై కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, హఫీజ్‌పేట్ డివిజన్ పరిధిలోని ప్రతి పోలింగ్ కేంద్రంలో BLA-2 బాధ్యులు, పార్టీ కార్యకర్తలు SIR ప్రక్రియపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని సూచించారు. SIR ప్రారంభానికి ముందే పోలింగ్ బూత్‌ల వారీగా ఓటరు జాబితాలను పరిశీలించి, BLO అధికారులతో సమన్వయం చేసుకుంటూ అర్హులైన ఓటర్లకు అవగాహన కల్పించాలని పేర్కొన్నారు.

అలాగే ఓటరు జాబితాలో ఎలాంటి తప్పులు లేకుండా చూసి, నిజమైన ఓటర్లకు ఓటు హక్కు వినియోగించే అవకాశం కల్పించాలని, రానున్న ఎన్నికల నేపథ్యంలో ఓటరు జాబితాల క‌చ్చితత్వంపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మాజీ డివిజన్ అధ్యక్షుడు శ్రీధర్ రావు, నాయకులు రమణయ్య, సత్యనారాయణ రాజు, పవన్, డివిజన్ ఉపాధ్యక్షుడు ప్రసాద్ పాత్రో, ప్రధాన కార్యదర్శులు జగన్ గౌడ్, మారెళ్ల వెంకటేశ్వర్లు, కార్యదర్శి చుక్క శ్రీను, మహిళా మోర్చా అధ్యక్షురాలు నిర్మల, ఓబీసీ మోర్చా అధ్యక్షుడు నరసింహ యాదవ్, ప్రధాన కార్యదర్శి రాజు గౌడ్, బీజేవైఎం అధ్యక్షుడు మహేష్ గౌడ్‌, శ్రీనివాస్ యాదవ్, అశోక్ నాయి, రాంరెడ్డి, అశోక్ ముదిరాజ్, శేఖర్ ముదిరాజ్, రవి ముదిరాజ్, రామచందర్ యాదవ్, రామారావు, ప్రభాకర్ రెడ్డి, మల్లేష్ పాల్గొన్నారు.

హఫీజ్‌పేట్ బీజేపీలో కొత్త నియామకాలు..

హఫీజ్‌పేట్ డివిజన్ బీజేపీ కార్యవర్గ సమావేశంలో డివిజన్ అధ్యక్షుడు కైతాపురం జితేందర్ ఆధ్వర్యంలో పార్టీ డివిజన్ కమిటీలో నూతన బాధ్యతలను ప్రకటించారు. ఈ సందర్భంగా హఫీజ్‌పేట్ డివిజన్ బీజేపీ ప్రధాన కార్యదర్శిగా మారెళ్ల వెంకటేశ్వర్లు, ఉపాధ్యక్షుడిగా యేషమ్ రాజు యాదవ్, కార్యదర్శిగా చుక్క శ్రీను నియమితులయ్యారు. అలాగే మహిళా మోర్చా ప్రధాన కార్యదర్శిగా అశ్వినీ, మహిళా మోర్చా కార్యదర్శిగా హేమలతకు నియామక పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు డాక్టర్ అజిత్ కుమార్ సేనాపతి, జిల్లా ప్రధాన కార్యదర్శి మహిపాల్ రెడ్డి, డివిజన్ మాజీ అధ్యక్షుడు శ్రీధర్ రావు, పార్టీ నాయకులు రమణయ్య, సత్యనారాయణ రాజు తదితరులు పాల్గొని నూతన బాధ్యతలు చేపట్టిన నాయకులకు శుభాకాంక్షలు తెలిపారు. పార్టీ బలోపేతం కోసం కృషి చేస్తూ, ప్రజా సమస్యల పరిష్కారంలో ముందుండాలని నాయకులు నూతన పదవిదారులకు సూచించారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here