కృష్ణ యాదవ్‌కు బీసీ నాయ‌కుల‌ జన్మదిన శుభాకాంక్షలు

శేరిలింగంప‌ల్లి, జూన్ 6 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): మాజీ మంత్రి సి. కృష్ణ యాదవ్‌కు తెలంగాణ రాష్ట్ర బీసీ ఐక్యవేదిక నాయకులు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర బీసీ ఐక్యవేదిక అధ్యక్షుడు భేరి రామచంద్ర యాదవ్ మాట్లాడుతూ కృష్ణ యాదవ్ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలతో సుఖసంతోషాలతో జీవించాలని ఆకాంక్షించారు. రాజకీయ పరంగా బీసీ వర్గాలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ, ప్రభుత్వం తరఫున అవసరమైన సహాయ సహకారాలు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు తెలిపారు. భవిష్యత్తులో కూడా ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర బీసీ ఫెడరేషన్ అధ్యక్షుడు ఆర్కే సాయన్న ముదిరాజ్, తెలంగాణ రాష్ట్ర బీసీ ఐక్యవేదిక ముఖ్య సలహాదారు పట్లూరి కృష్ణమోహన్, వర్కింగ్ ప్రెసిడెంట్, మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా మేదరి మహేంద్ర సంఘం అధ్యక్షుడు కొంటు ముకుందం, తెలంగాణ రాష్ట్ర బీసీ ఐక్యవేదిక యువజన అధ్యక్షుడు, తెలంగాణ రాష్ట్ర మేదరి మహేంద్ర సంఘం యువజన అధ్యక్షుడు కొంటు సుమన్, యువజన నాయకులు సిద్ధార్థ ముదిరాజు, శీను పటేల్, తెలంగాణ రాష్ట్ర బీసీ ఐక్యవేదిక ఆర్గనైజింగ్ సెక్రటరీ హరికృష్ణ చారి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here