స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌కు జన్మదిన శుభాకాంక్షలు

శేరిలింగంప‌ల్లి, జూన్ 4 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): తెలంగాణ రాష్ట్ర శాసనసభ సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ కి హ‌ఫీజ్‌పేట డివిజ‌న్ కాంగ్రెస్ పార్టీ సీనియ‌ర్ నాయ‌కుడు బాలింగ్ గౌతం గౌడ్ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని, ప్రజాసేవలో మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. ప్రజల సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధి కోసం ఆయన చేస్తున్న సేవలు మరింత విస్తరించాలని, భవిష్యత్తులోనూ ప్రజలకు ఆదర్శప్రాయ నాయకత్వాన్ని అందించాలని కోరుతూ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here