తెలుగునెస్ కిచెన్‌లో చిమ్ని పేలుడు

శేరిలింగంప‌ల్లి, జూన్ 1 (న‌మస్తే శేరిలింగంప‌ల్లి): శేరిలింగంప‌ల్లి నియోజ‌క‌వ‌ర్గం ప‌రిధిలోని ఓ హోట‌ల్ కిచెన్‌లో ప్ర‌మాద‌వ‌శాత్తూ పేలుడు సంభ‌వించి భారీగా పొగ‌లు వ‌చ్చాయి. ఈ ఘ‌ట‌న‌లో ఎలాంటి ప్రాణ న‌ష్టం జ‌ర‌గ‌క‌పోవ‌డంతో అంద‌రూ ఊపిరి పీల్చుకున్నారు. తెలుగునెస్ అనే హోట‌ల్‌కు చెందిన కిచెన్‌లో చిమ్ని ఒక్క‌సారిగా పేలింది. దీంతో కిచెన్‌లో ఉన్న సామ‌గ్రి చెల్లా చెదురై ద‌ట్టంగా పొగ‌లు అలుముకున్నాయి. స‌మాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది వెంట‌నే సంఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకుని మంట‌ల‌ను అదుపులోకి తెచ్చారు. అయితే ఈ ఘ‌ట‌న‌లో ఎలాంటి ప్రాణ న‌ష్టం సంభ‌వించ‌లేద‌ని, ప్ర‌స్తుతం అంతా స‌ద్దుమ‌ణిగింద‌ని అధికారులు తెలిపారు. చిమ్నిని స‌రిగ్గా శుభ్రం చేయ‌క‌పోవ‌డం వ‌ల్లే నిర్వ‌హ‌ణ లోపంతో అది పేలి ఉంటుంద‌ని భావిస్తున్నామ‌ని తెలిపారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here