నిరుపేద మహిళలకు ఉచిత కుట్టుమిషన్లు

శేరిలింగంప‌ల్లి, మే 31 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): శేరిలింగంపల్లి నియోజకవర్గంలో మిరియాల ప్రీతమ్ ఆధ్వర్యంలో నిర్వహించిన సేవా కార్యక్రమంలో పీఏసీ చైర్మన్, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే ఆరెక‌పూడి గాంధీ చేతుల మీదుగా నిరుపేద మహిళలకు ఉచిత కుట్టుమిషన్లు పంపిణీ చేశారు. మహిళలు స్వయం ఉపాధి సాధించి ఆర్థికంగా ఎదగడానికి ఈ కార్యక్రమం దోహదపడుతుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆరెక‌పూడి గాంధీ మాట్లాడుతూ మిరియాల ప్రీతమ్ మిరియాల రాఘవ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా విద్య, వైద్యం, సామాజిక సంక్షేమం తదితర రంగాల్లో నిరంతరం సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ సమాజానికి ఆదర్శంగా నిలుస్తున్నారని ప్రశంసించారు. నిరుపేదల అభ్యున్నతి కోసం ఆయన చేస్తున్న కృషి అభినందనీయమని అన్నారు. మిరియాల ప్రీతమ్ మాట్లాడుతూ ఆర్థికంగా వెనుకబడిన వర్గాల సంక్షేమమే లక్ష్యంగా ట్రస్ట్ ఆధ్వర్యంలో వివిధ సేవా కార్యక్రమాలు కొనసాగిస్తున్నామని తెలిపారు. మహిళల సాధికారతకు తోడ్పడే ఇలాంటి కార్యక్రమాలను భవిష్యత్తులో మరింత విస్తృతంగా చేపడతామని చెప్పారు.

ఈ కార్యక్రమంలో మిరియాల రాఘవ చారిటబుల్ ట్రస్ట్ డైరెక్టర్ మిరియాల రాఘవరావు, దొడ్ల వెంకటేష్ గౌడ్, నార్నే శ్రీనివాస్, సుబ్బారావు, త్రినాథ్, కృష్ణ, పరదేశి నాయుడు, ట్రస్ట్ సభ్యులు, స్థానిక నాయకులు, ప్రజలు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here