శేరిలింగంపల్లి, మే 23 (నమస్తే శేరిలింగంపల్లి): అట్టేపల్లి లక్ష్మీనారాయణ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ అట్టేపల్లి రామప్రభు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వారాంత అన్నదాన కార్యక్రమంలో భాగంగా నాలుగో వారం అన్నదాన కార్యక్రమం విజయవంతంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అవసరమైన వారికి ప్రేమతో, సేవాభావంతో అన్నదానం అందజేశారు. కార్యక్రమంలో ARP టీమ్ సభ్యులు, ట్రస్ట్ ప్రతినిధులు, స్థానిక ప్రజలు పాల్గొని సేవా కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఈ సందర్భంగా అట్టేపల్లి రామప్రభు మాట్లాడుతూ.. సమాజ సేవే లక్ష్యంగా భవిష్యత్తులో కూడా ఇలాంటి సేవా కార్యక్రమాలను నిరంతరం కొనసాగిస్తామని తెలిపారు. కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్కరికీ ట్రస్ట్ తరఫున కృతజ్ఞతలు తెలియజేశారు.






