శేరిలింగంపల్లి, మే 23 (నమస్తే శేరిలింగంపల్లి): హఫీజ్పేట్ డివిజన్ పరిధిలోని హఫీజ్పేట్లో ఉన్న బీఎల్వై హోమ్స్ వద్ద ప్రముఖ సంఘ సేవకుడు బోయిని లక్ష్మయ్య యాదవ్ 9వ వర్థంతి సందర్భంగా రక్తదాన శిబిరం, ఉచిత వైద్య శిబిరం, ఉచిత వైద్య పరీక్షలు, ఉచిత మందుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రముఖ వైద్యులచే ప్రజలకు ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించి, ఆరోగ్యానికి సంబంధించిన పలు రకాల పరీక్షలు, వైద్య సలహాలు అందించారు. అలాగే అత్యవసర పరిస్థితుల్లో గుండెపోటు లేదా ప్రమాదాల బారిన పడిన వ్యక్తుల ప్రాణాలను కాపాడేందుకు సీపీఆర్ (CPR) ఎలా చేయాలో ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. సీపీఆర్ ద్వారా ప్రాణాలను ఎలా రక్షించవచ్చో వైద్య నిపుణులు ప్రత్యక్షంగా వివరించారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో స్థానిక ప్రజలు పాల్గొని ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడంతోపాటు స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని కూడా నిర్వహించారు.

BLY చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో, ట్రస్ట్ చైర్మన్ బోయిని మహేష్ యాదవ్ నాయకత్వంలో నిర్వహించిన ఈ సేవా కార్యక్రమంలో పలువురు ప్రముఖ వైద్యులు, ప్రజాప్రతినిధులు, సామాజిక కార్యకర్తలు, యువకులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ బోయిని లక్ష్మయ్య యాదవ్ సేవా స్ఫూర్తిని కొనసాగిస్తూ సమాజానికి ఉపయోగపడే మరిన్ని సేవా కార్యక్రమాలను భవిష్యత్తులో కూడా నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ న్యూరాలజిస్ట్ డాక్టర్ బోయిని శ్రీకాంత్ యాదవ్, మల్లేష్ యాదవ్, రాజేష్ యాదవ్, నాగుల్ పటేల్, దివాన్ యాదవ్, లక్ష్మణ్ ముదిరాజ్, మాజీ కౌన్సిలర్ రమణయ్య, శ్రీశైలం కురుమ, శ్రీనివాస్ యాదవ్, రాజు గౌడ్, నాగులు పారునంది, పాలెం శీను, సత్యనారాయణ రాజు, సురేష్ యాదవ్, రాజు ముదిరాజ్, శివ కురుమ, మహేష్ గౌడ్, ఆంజనేయులు చౌదరి, రామారావు, సుబ్బారావుతోపాటు పలువురు డాక్టర్లు, ల్యాబ్ టెక్నీషియన్లు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.





