శేరిలింగంపల్లి, మే 21 (నమస్తే శేరిలింగంపల్లి): భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర ఓబీసీ మోర్చా ప్రధాన కార్యదర్శిగా నియమితులైన ఎర్రగుడ్ల ప్రభాకర్ యాదవ్ ని పలువురు బీజేపీ నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎర్రగుడ్ల ప్రభాకర్ యాదవ్ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా బీసీలకు అన్ని రంగాలలో ప్రాధాన్యత ఇచ్చింది బీజేపీ ప్రభుత్వం అని అన్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో బీసీలకు సంక్షేమ పథకాలు, వారి అభ్యున్నతి కోసం నిరంతరం కృషి చేస్తున్నారని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో కేవలం బీజేపీ ఆధ్వర్యంలోనే బీసీలకు న్యాయం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో హఫీజ్ పేట్ డివిజన్ బీజేపీ అధ్యక్షుడు కైతాపురం జితేందర్, బీజేపీ మాజీ కౌన్సిలర్ రమణయ్య, హఫీజ్ పేట్ డివిజన్ బీజేపీ ఉపాధ్యక్షుడు మారెళ్ల వెంకటేశ్వర్లు, హఫీజ్ పేట్ డివిజన్ బీజేపీ ప్రధాన కార్యదర్శి జగన్ గౌడ్, బీజేపీ నాయకుడు మనీష్ పాల్గొన్నారు.






