ట్రాఫిక్ రహిత సమాజం కోసం రాజీ లేని కృషి చేస్తాం: PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ

శేరిలింగంపల్లి, మే 21 (న‌మస్తే శేరిలింగంపల్లి): ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని ఉషా ముళ్ళపూడి కమాన్ నుండి గాజులరామారం వరకు చేపడుతున్న వయా ఎల్లమ్మబండ ప్రధాన రహదారిలో జరుగుతున్న 100 ఫీట్ రోడ్డు విస్తరణ పనులను జలమండలి అధికారులు, సీఎంసీ ఇంజనీరింగ్ విభాగం అధికారులతో కలిసి PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ పరిశీలించారు. ఈ సందర్బంగా గాంధీ మాట్లాడుతూ ఉషా ముళ్ళపూడి కమాన్ నుండి గాజుల రామారం వెళ్లే రోడ్డు వయా ఎల్లమ్మబండ రోడ్డు నిత్యం ట్రాఫిక్ సమస్యతో ప్రజలు తీవ్ర ఇక్కట్లు పడుతున్నార‌ని అన్నారు. ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి 100 ఫీట్ రోడ్డు విస్తరణ చేపట్టడం జరిగింద‌ని తెలిపారు. అందులో భాగంగా ప‌నులు కొన‌సాగుతున్నాయ‌ని, వీలైనంత త్వ‌ర‌గా అధికారులు ప‌నుల‌ను పూర్తి చేసి ప్ర‌జ‌ల‌కు రోడ్డును అందుబాటులోకి తేవాల‌ని అన్నారు. ప్ర‌జా స‌మ‌స్య‌ల ప‌రిష్కారానికి పెద్ద పీట వేస్తున్న‌ట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జలమండలి అధికారులు DGM శ్రీనివాస రాజు, CMC ఇంజనీరింగ్ విభాగం అధికారులు DE మౌనిక, వర్క్ ఇన్స్పెక్టర్ రవి కుమార్, నాయకులు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, జిల్లా గణేష్, మారేళ్ల శ్రీనివాస్, MD ఇబ్రహీం, కాజా , కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here