శేరిలింగంపల్లి, మే 19 (నమస్తే శేరిలింగంపల్లి): వెంకటేశ్వర నగర్ డివిజన్ పరిధిలోని ఆస్బెస్టాస్ కాలనీ రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కు నూతనంగా ఎన్నుకోబడిన కాలనీ అసోసియేషన్ నూతన కార్యవర్గ సభ్యులు PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీని వివేకానంద నగర్ లోని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నూతన కార్యవర్గ సభ్యులను గాంధీ శాలువాతో సన్మానించి, అభినందించారు. ఈ సందర్భంగా ఆరెకపూడి గాంధీ మాట్లాడుతూ ఆస్బెస్టాస్ కాలనీ రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ వాసులు కాలనీ అభివృద్ధికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని అన్నారు. కాలనీలో అన్ని రకాల మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తానని, కాలనీ అభివృద్ధికి తన వంతు సహాయ సహకారాలు ఎల్లవేళలా ఉంటాయని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆస్బె స్టాస్ కాలనీ రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ నరేష్, వైస్ ప్రెసిడెంట్ నర్సింహులు, జనరల్ సెక్రటరీ మహ్మద్ హుస్సేన్, జాయింట్ సెక్రటరీ రఫిక్, ట్రెజరర్ పుష్ప, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.






