కిషోర్ కుమార్ గౌడ్ కుటుంబాన్ని పరామర్శించిన ఆరెకపూడి గాంధీ

శేరిలింగంప‌ల్లి, మే 18 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): కిషోర్ కుమార్ గౌడ్ అకాల మరణం వార్త తెలుసుకున్న పీఏసీ చైర్మ‌న్‌ ఆరెకపూడి గాంధీ ఆయ‌న నివాసానికి చేరుకుని పార్థివ దేహానికి నివాళులర్పించారు. అనంతరం కిషోర్ కుమార్ గౌడ్‌ కుటుంబ సభ్యులను కలిసి గాంధీ పరామర్శించారు. ఈ విషాద సమయంలో తాము ఎల్లప్పుడూ ఆ కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. కిషోర్ కుమార్ గౌడ్ మృతి పట్ల ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేస్తూ కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని, కుటుంబ సభ్యులకు ఈ కోలుకోలేని దుఃఖాన్ని తట్టుకునే మనోధైర్యాన్ని ప్రసాదించాలని ప్రార్థిస్తున్న‌ట్లు తెలిపారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here