శేరిలింగంపల్లి, మే 14 (నమస్తే శేరిలింగంపల్లి): చందానగర్‌లోని హుడా కాలనీ రెసిడెంట్స్ వెల్ఫేర్ సొసైటీ కార్యాలయం ఫేజ్ 2లో ఉన్న కమ్యూనిటీ హాల్లో సొసైటీ ఆధ్వర్యంలో చందానగర్‌లోని వన్ కార్డియాక్ సెంటర్ సహకారంతో ఉచిత స్పెషాలిటీ మెడికల్ క్యాంప్‌ను నిర్వహించనున్నారు. ఈ నె 17న నిర్వహించనున్న ఈ క్యాంప్ ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు కొనసాగుతుందని, ప్రజల ఆరోగ్య పరిస్థితిని తెలుసుకునేందుకు ప్రాథమిక వైద్య పరీక్షలు నిర్వహించబడతాయని అన్నారు. అవసరమైన వారికి తదుపరి వైద్య పరీక్షలపై సూచనలు కూడా అందిస్తారని తెలిపారు. ప్రజలు బీపీ, జీఆర్బీఎస్, బరువు, ఈసీజీ వంటి పరీక్షలను ఉచితంగా చేయించుకోవచ్చని తెలిపారు. జనరల్ ఫిజీషియన్ కన్సల్టేషన్ అందుబాటులో ఉంటుందని, ప్రత్యేక డిస్కౌంట్ కూపన్లు కూడా పంపిణీ చేయబడతాయని తెలిపారు. మరిన్ని వివరాలకు 9948667185, 9440684002 అనే ఫోన్ నంబర్లలో సంప్రదించవచ్చని అన్నారు.






